రికార్డు సృష్టించిన భారతీయ బాక్సర్ అమిత్ పంగల్

  • ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో నిరాశపరిచిన పంగల్
  • రజతం సాధించి రికార్డులకు
  • ఒకే చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారతీయ బాక్సర్ అమిత్ పంగల్ రికార్డు సృష్టించాడు. రష్యాలోని ఏక్తరిన్‌బర్గ్‌లో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో ఫైనల్‌కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించిన పంగల్.. శనివారం జరిగిన ఫైనల్‌లో రజతం గెలుచుకుని మరో రికార్డు సాధించాడు. 52 కేజీల ఫ్లైవెయిట్ విభాగంలో జరిగిన ఫైనల్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన షఖోబిదిన్ జొయిర్‌రోవ్ చేతిలో పంగల్ 0-5తో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకున్నాడు. అయినప్పటికీ ఓ అరుదైన రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన తొలి బాక్సర్‌గా అమిత్ రికార్డులకెక్కాడు.

మరో విభాగంలో భారత్‌కే చెందిన మరో బాక్సర్ మనీశ్ కౌశిక్ సెమీస్‌లో ఓడి కాంస్యం దక్కించుకున్నాడు. దీంతో ఒకే పోటీల్లో రెండు పతకాలు భారత్‌కు లభించాయి. ఇది కూడా ఓ రికార్డే. గతంలో విజేందర్‌సింగ్, వికాశ్ కృష్ణన్, శివథాపా, గౌరవ్ బిదూరిలు కాంస్య పతకాలు సాధించారు. అయితే, వీరంతా వేర్వేరు సంవత్సరాల్లో జరిగిన చాంపియన్‌షిప్ పోటీల్లో ఈ పతకాలు అందుకున్నారు.
Go Back to Shorts
amit panghal
boxing championship
India
Russia

More Telugu News